రాధేశ్యామ్ దర్శకుడికి ఎంత కష్టమొచ్చిందో?


రాధే శ్యామ్ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ఇ సినిమా కు బారీగా ఖర్చు పెట్టిన యూవీ క్రియేషన్స్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడక తప్పలేదు. సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కోలుకోలేని విధంగా నష్టాలను మిగిల్చింది. ఇక దర్శకుడు రాధాకృష్ణ కెరీర్ పై కూడా ఆ ప్రాజెక్ట్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

సోషల్ మీడియాలో అయితే రాధాకృష్ణ పై ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక దర్శకుడు ఆ పోరు పడలేక ట్విట్టర్ లో స్పందించాలి అంటేనే ఆలోచించాల్సి వస్తోంది. ఎలాంటి ట్వీట్ చేసినా కూడా అతను ఇతరులు స్పందించే ఛాన్స్ ఇవ్వడం లేదు. ట్విట్టర్ లో కామెంట్స్ చేసే అవకాశం అయితే ఇవ్వడం లేదు. నేడు ఎన్టీఆర్ కు పుట్టినరోజు విషెస్ చెప్పినప్పటికీ కూడా అతను ఎవరు కూడా కామెంట్స్ చేయకుండా ప్రైవసీ సెట్ చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఈ తరహాలో రాధాకృష్ణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post