బాలయ్య కూతురి పాత్ర.. షాకింగ్ రెమ్యునరేషన్?


నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కలయికలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల F 3 సినిమా ప్రమోషన్ లో ప్రాజెక్టు పై దర్శకుడు అనిల్ రావిపూడి ఒక క్లారిటీ ఇచ్చాడు. బాలకృష్ణ 45 నుంచి 50 ఏళ్ల మధ్య లో ఉండే ఒక పవర్ఫుల్ మ్యాన్ కనిపిస్తాడు అని అయితే అతనికి కూతురు పాత్రలో ఒక హీరోయిన్ నీ కూడా సెలక్ట్ చేసుకున్నట్లు తెలియజేశారు.

పెళ్లి సందడి సినిమా తో మంచి సక్సెస్ అందుకున్న శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అలాగే బాలయ్య బాబుకు కూతురి పాత్రలో నటించడానికి ఏ మాత్రం సందేహం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే హీరోయిన్ గా ఇప్పటికే ఒక కోటి వరకు పారితోషికం అందుకుంటున్న శ్రీలీల, బాలయ్య బాబు సినిమా కోసం కూడా అదే తరహాలో డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర హీరోయిన్ కంటే చాలా పవర్ఫుల్గా ఉంటుందని సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు దర్శకుడు వివరణ ఇచ్చాడు.

Post a Comment

Previous Post Next Post