రివ్యూ @ అంటే సుందరానికి!


కథ:
అత్యంత సనాతన హిందూ కుటుంబంలోని ఏకైక వారసుడు సుందర్ (నాని).  అతని విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే కుటుంబ సభ్యులు అతనికి నచ్చని ఆచారాలతో విసుగు తెప్పిస్తారు. ఇక క్రిస్టియన్ కుటుంబం నుండి వచ్చిన లీల (నజ్రియా)తో అతను ప్రేమలో పడతాడు.  వేర్వేరు మతాలకు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడినప్పుడు ఏం జరుగుతుంది?  వారు పెళ్లి చేసుకోవడానికి వారి కుటుంబాలు ఎలాంటి కండిషన్స్ పెట్టారు? ఒక అద్భుతమైన ఐడియాతో కథ ఎలా ముందుకి సాగుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  

విశ్లేషణ:
దర్శకుడు ఈ సినిమా కథలో నేను పాయింట్ ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయడానికి ఫస్ట్ మొత్తంలో కొంత సాగదీశాడు అనే చెప్పాలి. ముఖ్యంగా కథలోని క్యారెక్టర్స్ అలాగే రెండు ప్రధాన పాత్రల మధ్య కొనసాగే ప్రేమ కథనం ఆ తరువాత వారి చిన్నప్పటి సన్నివేశాలు వీటికి తోడు గెస్ట్ అప్పియరెన్స్ లో వచ్చిన అనుపమ పరమేశ్వరన్ పాత్ర కూడా అంత కొత్తగా ఏమీ అనిపించదు. మధ్య మధ్యలో హర్షవర్ధన్ కు అలాగే అనుపమకు కథను వివరించడం కూడా పెద్దగా బోరింగ్ గా అనిపిస్తుంది. సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు ఇదివరకు ట్రైలర్లో చూడడం వలన కూడా ఫస్టాఫ్ మొత్తం పెద్దగా ఆసక్తిని అనిపించదు.

దర్శకుడు వివేక్ ఆత్రేయ ఫస్టాఫ్ విషయంలో మాత్రం అంతంతమాత్రంగానే మెప్పించాడు. పలు రకాల కామెడీ సన్నివేశాలు సినిమాలో హైలెట్ అయినప్పటికీ కూడా ఓ వర్గం ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇక సెకండాఫ్ లో మాత్రం అసలు కథను ముందుకు సాగించాడు. సుందర్ లీల మధ్య కొనసాగే ప్రేమ సన్నివేశాలు ఆ తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలతో ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ప్రేక్షకులకు ఒక వైపు నవ్విస్తూనే ఒకవైపు మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాలు కూడా దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా రోహిణి అద్భుతంగా నటించాడు. మరోవైపు నరేష్ అలాగే మిగతా యాక్టర్స్ వారి పాత్రలకు తగ్గట్టుగా మెప్పించారు.

దర్శకుడు వివేక్ మతాంతర వివాహానికి సంబంధించిన స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టోరీ పాయింట్‌ని తీసుకొని వాటికి సంబంధించిన సంప్రదాయాలను గుడ్డిగా అనుసరించడం నుండి కామెడీని బాగానే రాబట్టాడు, కుటుంబం మరియు ప్రేమ మధ్య సమతుల్యతను హైలెట్ చేస్తూ దాదాపు మూడు గంటల ఈ చిత్రాన్ని రూపొందించారు. 

నాని తన సుందర్ పాత్రతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. నజ్రియా పాత్ర మాత్రం ఉహించినంత కొత్తగా ఏమి లేదు. ఆ పాత్రకు ఎవరైనా సరే సరిపోతారు అని చెప్పవచ్చు. గతంలో ప్రేమికులు పెళ్లి కోసం ఇంట్లో వారిని ఒప్పించడం అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే దర్శకుడు ఈసారి క్యాస్ట్ ఫీలింగ్ తో వెండితెరపై కామెడీ క్రియేట్ చేశాడు. ఇక ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది మ్యూజిక్ అనే చెప్పాలి. కొత్త తరహా కంపోజ్ చేస్తే సరిపోదు అవి ఆడియెన్స్ కు నచ్చుతాయా లేదా అనేది చూడాలి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా హైలెట్ ఏమి అవ్వలేదు. మొత్తంగా సినిమా అయితే పరవాలేదు అనేలా కామెడీతో మెప్పించింది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడవచ్చు. కానీ దాదాపు మూడు గంటల నిడివి అనేది అనవసరం. ఫస్ట్ హాఫ్ లో ఎడిటర్ కత్తెరకు పని చెబితే బాగుండేది. 

ప్లస్ పాయింట్స్:
👉సెకండ్ హాఫ్
👉నాని యాక్టింగ్

మైనస్ పాయింట్స్:
👉మ్యూజిక్
👉నిడివి ఎక్కువగా ఉండడం

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post