Type Here to Get Search Results !

'రాధే శ్యామ్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 'జీ తెలుగు' లో...


వరుస బ్లాక్ బస్టర్ టెలివిజన్ ప్రీమియర్స్ తో వీక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచుతున్న 'జీ తెలుగు', ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' సినిమాతో మీ ముందుకు రానుంది. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడి, వినసొంపైన మ్యూజిక్ తో, మనస్సుకి హత్తుకునే సన్నివేశాలతో, ఈ ప్రేమకథ ప్రేక్షకులకు ఈ వారాంతం మంచి అనుభూతిని కలిగించబోతుంది. 

ప్రముఖ హస్తసాముద్రికుడి పాత్రలో అదరగొట్టిన ప్రభాస్ (విక్రమాదిత్య), ప్రేమ అనే సిద్ధాంతంపై విముఖతతో ఉంటాడు. చేతిరాతలను, గ్రహాల మరియు నక్షత్రాల స్థితిగతులను గట్టిగా విశ్వసించే విక్రమాదిత్య, సైన్స్ మాత్రమే నిజమని, విధి అంతా ఒక అబద్దమని నమ్మే డాక్టర్ ప్రేరణ (పూజా హెగ్డే) ను కలుస్తాడు. విభిన్న వ్యక్తిత్వాలు, నమ్మకాలు కలిగిన ఈ పాత్రలు ప్రేమలో పడడం, ఆ తరువాత జరిగే పరిణామాలు, ఊహించని మలుపులతో ఈ సినిమా అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.  
'రాధే శ్యామ్' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ను పురస్కరించుకుంటూ 'జీ తెలుగు' వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, ప్రభాస్ అభిమానులకు కంచుకోటగా ఉన్న భీమవరంలో జూన్ 18న ఆహ్లాదకరమైన 'రాధే శ్యామ్ థీమ్ పార్క్' ను ఏర్పాటుచేసి, అభిమానుల సందడి మధ్య ఈ చిత్ర టెలివిజన్ ప్రీమియర్ తేదీని మరియు సమయాన్ని ఫాన్స్ ద్వారా ప్రకటింపజేసింది. ఈ సందర్బంగా ఫోన్ ద్వారా మాట్లాడిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి, అభిమానులు 'రాధే శ్యామ్' చిత్రాన్ని థియేటర్లలో ఎంతగానో ఆదరించారని, ఇప్పుడు 'జీ తెలుగు' లో కూడా అలాగే ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే ఒక అద్భుతమైన దృశ్యకావ్యమని, ఇంతకముందు చూడని వారు ఇప్పుడు టీవీలో చూసి ఒక గొప్ప అనుభూతిని పొందాలని ఆవిడ కోరారు.  

వివిధ ప్రాపర్టీస్ యొక్క ఫోటో ఫ్రేమ్స్ తో ఈ థీమ్ పార్క్ అభిమానులకు సినిమాలో పలు దృశ్యాలను అనుకరించే అవకాశం కల్పించింది. ప్రేక్షకులు సినిమాలోని ట్రైన్ సన్నివేశాన్ని అనుకరించి, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో, భీమవరంలో 'రాధే శ్యామ్' సందడి నెలకొంది. 
అభిమానులు మరియు ప్రేక్షకుల కోసం 'జీ తెలుగు' ఫ్లేమ్స్ (FLAMES) అనే టెక్ ఇన్నోవేషన్/గేమ్ ను కూడా ప్రమోషన్స్ లో భాగంగా ప్రారంభించింది. zeetelugu.tv కి వెళ్ళి మీ యొక్క ఫ్లేమ్స్ ఫలితాన్ని తెలుసుకోవచ్చు.   

ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు 'రాధే శ్యామ్' చిత్రాన్ని ‘జీ తెలుగు’లో 
సకుటుంబ సపరివార సమేతంగా తప్పక వీక్షించండి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies