కోటి ఇచ్చినా అక్కడ పాడనని చెప్పిన KK - TollywoodBoxoffice.in

Exclusive Portal for Tollywood Boxoffice

కోటి ఇచ్చినా అక్కడ పాడనని చెప్పిన KK


భారతీయ సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయకుడు కెకె (కృష్ణకుమార్ కున్నాత్) కూడా గుండెపోటుతో మరణించడం సంగీత ప్రియులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మే 31న కోల్‌కతాలో ప్రదర్శన ఇస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హోటల్‌కి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సినిమాల్లో ఒక్కో పాటలు నాలుగు లక్షల వరకు తీసుకునే కేకే 1 కోటి రెమ్యూనరేషన్ ఇచ్చినా పెళ్లిళ్లలో పాడనని గతంలో చెప్పాడు. అంతే కాకుండా ధనవంతుల ప్రయోవేట్ పార్టీలలో కూడా పాడనని చెప్పాడు. ఫ్యాన్ ఎక్కువగా వచ్చే ఈవెంట్స్ లోనే పాడతానునని ఒక నిబద్దతోనే ఆదాయాన్ని అందుకుంటూ వచ్చాడు.