Virata Parvam @ Movie Review


కథ:
విరాట పర్వం 70వ దశకంలో వెన్నెల పుట్టుకతో మొదలవుతుంది, 80లు మరియు 90ల కాల వ్యవధిలో.  ఒక చిన్న గ్రామానికి చెందిన వెన్నెల (సాయి పల్లవి) అనే అమ్మాయి నక్సలైట్ నాయకుడు రవన్న (రాణా దగ్గుబాటి) రాసిన విప్లవాత్మక నవలలతో ఆకట్టుకుంటుంది.  చివరికి, వెన్నెల రవన్నతో ప్రేమలో ఉందని తెలుసుకుని, ఇంటి నుండి పారిపోయి అతన్ని కలవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో వెన్నెల ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరకు రవన్నను కలుస్తుంది.
తన ప్రేమను వెల్లడించిన వెంటనే, వెన్నెల ప్రేమ ప్రతిపాదనను రవన్న అంగీకరిస్తాడా? ఇక ఈ ఇంటెన్సివ్ డ్రామాలో నక్సలైట్‌లతో పాటు వెన్నెల ఎలా నిలదొక్కుకుంటటుంది అనేది సినిమాలో చూడాలి.


విశ్లేషణ: 
సాయిపల్లవి అనగానే ఆమె చెప్పే డైలాగులు అలాగే డాన్స్ లు ఇలా అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ లో గుర్తుకు వస్తూ ఉంటాయి. అయితే ఆమె మొదటిసారి ఆ ఎలిమెంట్స్ కు పూర్తి భిన్నంగా చేసిన సినిమానే విరాటపర్వం. దర్శకుడు వేణు ఈ సినిమాను ఒక కవిత్వం అన్న తరహాలో తెరపైకి తీసుకువచ్చాడు. సినిమాలో ప్రతి డైలాగు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తుంది. ఆమె పుట్టుకనుంచి అలాగే తను ఇష్టపడిన ఒక విప్లవ కామ్రేడ్ ని ఎలా కలుసుకుంది అనే ప్రయాణంలో ఎన్నో అంశాలను హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రేమ ఎప్పుడు ఎలా పడుతుంది అనేది ఎవరికీ తెలియదు. 

అయితే ఒక చిన్న కవిత్వం నుంచి వెన్నెల కు పుట్టిన ప్రేమ ఆమె ఎంత వరకు తీసుకువెళ్ళింది అనే అంశం కొంత ఆసక్తికరంగానే ఉంది. ఒక విధంగా దర్శకుడు ఎంచుకున్న కథ చాలా కొత్తగా ఉంది అని చెప్పాలి. ఇది నిజంగా జరిగిన కథ అని ఇది వరకే చిత్ర యూనిట్ సభ్యులు హైలెట్ చేశారు. అయితే కొద్దిగా ఇది ప్రేమ కథ కాబట్టి మధ్యలో కథానుసారంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే విప్లవాత్మక సన్నివేశాలను చూపించక తప్పదు. అయితే దర్శకుడు ప్రేమను హైలెట్ చేసినంతగా మిగతా విషయాలను మాత్రం పెద్దగా హైలెట్ చేయలేకపోయాడు. 

సాయి పల్లవి పాత్రను తీర్చి దిద్దిన విధానం బాగానే ఉంది కానీ ఆమెను యాక్షన్ సన్నివేశాల్లో చూపించే విధానం కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. ఇక నక్సలిజం ను హైలెట్ చేయాలి కాబట్టి పోలీసులపై వారు చేసే దాడుల్లో కాస్త సినిమాటిక్గా కలిగిస్తాయి. కథ మొత్తం కవిత్వంగా ఉంటే అందులో ఉండే యాక్షన్ సన్నివేశాలు మాత్రం నెగిటివ్ ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక రానా దగ్గుబాటి పాత్ర కూడా చాలా బాగా ప్రెజెంట్ చేయడం జరిగింది. అతను చెప్పిన డైలాగులు విప్లవాత్మక మాటలు కూడా ఎంతగానో ఆలోచింపజేస్తాయి. కానీ ఇలాంటి సన్నివేశాలు నేటి తరం ప్రేక్షకులకు ఏ విధంగా అర్థమవుతాయి అనేది కాస్త సందేహం గానే ఉంటుంది. 

నక్సలిజం గురించి అవగాహన ఉన్న వారికి సినిమా ప్రేమ కథ ఎంతవరకు ఎక్కుతుందో చెప్పడం కష్టమే. ఇక నేటి తరం వారికి ఆ అభ్యుదయభావాలు గురించి పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఇక నటీనటులు అందరు కూడా ఈ సినిమాలో చాలా బాగానే నటించారు. కానీ వారందరిలో సాయి పల్లవి రానా మాత్రమే హైలెట్ అయ్యారు. ఇక సినిమాకు సురేష్ సంగీతం మాత్రం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. దర్శకుడు చెప్పిన ప్రతి డైలాగ్ అలాగే ప్రతి సన్నివేశం కూడా అతను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరో లెవెల్ కి తీసుకు వెళ్ళాడు. ఇక కెమెరా పనితనం కూడా అద్భుతంగా ఉంది. ప్రతి షాట్ ను కూడా సినిమాటోగ్రఫర్ డాని చాలా విభిన్నంగా స్క్రీన్ పైకి తీసుకువచ్చాడు. ఇక ఈ సినిమాలో మైనస్ అంటే క్లైమాక్స్. ఆ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ముగింపు పలకాలి అనే విధంగానే ముందుకు సాగినట్లు అనిపించింది. ఏదేమైనా విరాటపర్వం నక్సల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక అందమైన ప్రేమ కవిత్వం. సినిమాను పరవాలేదు అనే విధంగా బాగానే తెరపైకి తీసుకు వచ్చారు. కానీ ఆడియేన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్
👉సాయి పల్లవి, రానా పెర్ఫార్మెన్స్ 
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
👉డైలాగ్స్
👉సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్
👉క్లయిమ్యాక్స్

రేటింగ్3/5

Post a Comment

Previous Post Next Post