రెమ్యునరేషన్ 1000 కోట్లెంది సామీ?


ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల పారితోషికాలు వందల కోట్లు దాటుతున్నాయి. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ఐతే ఒక్కో సినిమాకు 150 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా అంతకంటే ఎక్కువ రేంజ్ లో రేట్లు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఒక రియాలిటీ షో చేయడానికి 1000 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి క్రేజ్ అందుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు 16వ సీజన్ మొదలు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నాడు. అయితే ఈ క్రమంలో అతను దాదాపు సీజన్ మొత్తానికి 1000 కోట్ల వరకు రౌండ్ ఫిగర్ అమౌంట్ అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే ఒక్కో ఎపిసోడ్ కు 20 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా టాక్ వచ్చింది. అంటే మొత్తంగా ఆ సీజన్ కు అతనికి 450 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వచ్చాయి. ఇక ఇప్పుడు 16వ సీజన్ కు డిమాండ్ మరింత పెరిగింది అని ఆ పేమెంట్ ను 1000కోట్లకి పెంచినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే
.

Post a Comment

Previous Post Next Post