రాజమౌళి - త్రివిక్రమ్.. మహేష్ ఇచ్చింది తీసుకోవాలంతే!


సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నిర్మాతలు పారితోషికాలు ఇవ్వడం కన్నా కూడా వారికి వచ్చిన లాభాల్లో వాటాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక విధంగా ఇది మంచిదే. పారితోషికాలు తీసుకోకుండా సినిమా బిజినెస్ మొత్తం పూర్తయిన తర్వాత బిజినెస్ ను బట్టి షేర్ తీసుకుంటే పారితోషికం కంటే ఎక్కువ వస్తుంది. ఒకవేళ సినిమా డిజాస్టర్ అయితే మాత్రం నిర్మాత కొంత సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. హీరోకు ప్రాఫిట్స్ సంగతి పక్కన పెడితే నిర్మాతను ముంచలేదన్న బాధ తీరుతుంది.

ఈ క్రమంలో మహేష్ బాబు గత కొన్నాళ్లుగా తన GMB ప్రొడక్షన్స్ ను తన ప్రతీ సినిమాలతో అనుసంధానం చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. ప్రతి పైసా ఖర్చును ప్రాఫిట్స్ లెక్కలను కూడా సినిమాలో భాగమయ్యే ప్రొడక్షన్స్ జాగ్రత్తగా చూస్తూ ఉంటాయి. కాబట్టి GMB సంస్థ మహేష్ బాబుకు చాలా వరకు లాభాలు అందించింది. అయితే రాజమౌళి త్రివిక్రమ్ మాత్రం మహేష్ బాబుకు ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చారు.

త్రివిక్రమ్ తో చేయబోయే మహేష్ బాబు 28వ సినిమాకు కేవలం హారిక హాసిని మాత్రమే నిర్మించబోతోంది. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతలతో కలిసి వాటా అందుకునే విధంగా డీల్ సెట్ చేసుకున్నాడు. ఇక మహేష్ బాబుకు మాత్రం కేవలం 60 నుంచి 70 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ ఇచ్చేసి సినిమా పూర్తి చేయాల్సిందే.  మరోవైపు రాజమౌళి గత కొంతకాలంగా అలానే చేస్తున్నాడు. 

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఆయన సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకుని సైడ్ అయిపోవాల్సిందే. కాబట్టి మహేష్ తో చేయబోయే సినిమాని కేవలం శ్రీదుర్గ ఆర్ట్స్ నిర్మించనుంది. ఆ సినిమా ప్రాఫిట్స్ లో కూడా పూర్తిగా జక్కన్న షేర్ అందుకోబోతున్నాడు. మహేష్ బాబు కూడా జక్కన్న మాటను కాదని చేయలేని పరిస్థితి. ఈ విధంగా మహేష్ బాబు చాలా కాలం తర్వాత లాభాల్లో వాటా లేకుండా కేవలం పారితోషికం అందుకుని సైడ్ అవుతున్నాడు.

1 Comments

  1. సినిమా లాభనష్టాలుతో సంబంధం లేకపోతే బాధ్యత వహించాలని అనలేరు కదా.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post