అక్కినేని నాగచైతన్యను ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న సమంత ఐదేళ్ల బంధం తర్వాత విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె గతంలో కంటే ఉన్నత స్థాయిలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తుంది. ఇక రీసెంట్ గానే అక్షయ్ కుమార్ తో కలిసి ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే.
అయితే ఈ షోలో సమంత తన డివోర్స్ విషయం గురించి స్పందించింది. ఇక అక్కినేని వారి నుంచి ఆమెకు 250 కోట్ల వరకు భరణం కూడా వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై సమంత మాత్రం ఊహించిన విధంగా సెటైర్ వేసింది. ఆ న్యూస్ రాగానే తనకు చాలా కంగారుగా అనిపించింది అని ఎక్కడా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సోదలు నిర్వహిస్తారేమో అని అనుకున్నాను అని అందులో నిజం లేదన్నట్టు నవ్వుతూ సెట్టర్ వేసేసింది.
అంతేకాకుండా విడాకుల విషయం అనేది వ్యక్తిగత నిర్ణయం అని మొదట్లో కొంత బాధనిపించినప్పటికీ ఆ తర్వాత సరైన నిర్ణయం అనిపించింది అని తెలిపింది. అంతేకాకుండా కరణ్ జోహార్.. నీ భర్త నుంచి విడిపోయినప్పుడు అని అన్నప్పుడు.. ఆమె మాజీ భర్త అనాలని సవరణ చేయడం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.
Follow
Follow
Post a Comment