ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల కాలంలో నిర్మించిన ఏ సినిమా కూడా పెట్టిన పెట్టుబడికి అనుకున్నంత స్థాయిలో అయితే ప్రాఫిట్స్ అందించ లేకపోయింది. థియేట్రికల్ గా అయితే ఆయన చాలా వరకు నష్టాలను చూడాల్సి వచ్చింది. రీసెంట్గా వచ్చిన F3 సినిమా కూడా చాలా వరకు బయ్యర్లకు నష్టాలను కలిగించాయి. అయితే అదే బయ్యర్లకు దిల్ రాజు చాలా తక్కువ రేట్లకు థాంక్యూ సినిమాను అమ్మాల్సి వచ్చింది.
ఇక సినిమా కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ రావు అని ముందే పసిగట్టేసారట. అందుకే పెద్దగా హడావిడి కూడా ఏమి కనిపించలేదు. సినిమాకు ఓవర్ గా హైప్ పెంచి అనవసరంగా క్రెడిబిలిటి దెబ్బ తీసుకోవడం ఎందుకని అనుకున్నారో ఏమో గాని ఎక్కడ కూడా హీరో తప్పితే మరెవరు కూడా పెద్దగా సినిమాని ప్రమోట్ చేసింది లేదు. దానికి తోడు వర్షాలు కూడా జనాలను థియేటర్లకు రాణించలేదు.

ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రాఫిట్స్ అయితే ఏమీ రావు అన్న విషయం ముందుగానే తెలిసి దిల్ రాజు నాన్ థియేట్రికల్ బిజినెస్ పై ఫోకస్ పెట్టి సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ అలాగే సన్ NXT సంస్థలకు దాదాపు 12 కోట్ల వరకు అమ్ముకున్నట్లు సమాచారం. ఇక శాటిలైట్, డబ్బింగ్ రూపంలో మరికొంత డబ్బును అందుకుని మొత్తంగా పెట్టిన బడ్జెట్ మొత్తం వెనక్కి లాగేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా దిల్ రాజు మాత్రం ఒక చోట పోగొట్టుకుంటే మరొకరు చోట మాత్రం ప్రాఫిట్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
Follow
Follow
Post a Comment