బిగ్ బాస్ 6 ప్లాన్ రెడీ.. ఎంత వరకు వచ్చిందంటే?


టెలివిజన్ ప్రపంచంలో మంచి గుర్తింపును అందుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరవ సీజన్ ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఇటీవల బిగ్ బాస్ ఆరో సీజన్ కు సంబంధించిన పూర్తి ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక షోకు ఆరవ సీజన్ లో ఎవరెవరు వస్తారు ఎలా మొదలుపెడతారు? అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వెలువడుతున్నాయి. ఇక ఈ షోకు సంబంధించిన ప్రోమో కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది

బిగ్ బాస్ చాలా మందికి నచ్చే షో.  ఇప్పటికే ఐదు సీజన్‌లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఆరో సీజన్‌కు సిద్ధమవుతోంది. నాగార్జున ఈ షోను హోస్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక అప్‌డేట్ ప్రకారం నాగ్ తో ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రోమోను చిత్రీకరించారు. ఈసారి షో మరింత మెరుగ్గా సాగనుందట. స్టార్ మా, హాట్ స్టార్ లో ప్రసారమయ్యే షో కోసం టెలివిజన్ యాక్టర్స్ యూ ట్యూబర్స్ కంటెస్టెంట్ గా రానున్నట్లు తెలుస్తోంది. ఇక షో మొదటి ఎపిసోడ్ సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ట్ కానుంది.

Post a Comment

Previous Post Next Post