2008లో వచ్చిన బాలికా వదు సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా టెలికాస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ సీరియల్ తో అవికా ఎంతగానో క్రేజ్ అందుకుంది. ఆమె నటించింది రెండేళ్లే అయినా ఆ సీరియల్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది మాత్రం ఎక్కువగా అవికా మాత్రమే.
అయితే ఆమె ఆ తర్వాత రెండు పదుల వయసులోకి రాకముందే ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అనంతరం కొన్ని చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ హిందీ సీరియల్స్ లో లీడ్ రోల్స్ తో కూడా మెప్పించింది. ఇక ఇటీవల మొదటి సారి బికినీలో దర్శనం ఇచ్చిన అవికా గోర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది. అవికా గతంలో గ్లామరస్ స్టిల్స్ తో బాగానే కనిపించింది కానీ బికినీలో మాత్రం ఈ రేంజ్ లో మాత్రం కనిపించలేదు. ఇక రీసెంట్ గా ఆమె థాంక్యూ అనే సినిమాలో ఒక చిన్న రోల్ లో నటించింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో 1920 అనే ఒక హారర్ కథలో నటిస్తోంది.
Follow
Post a Comment