ఏజెంట్ కాస్త ఎక్కువైందా?.. కారణముంది!


అఖిల్ నటించిన ఏజెంట్ టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైన విషయం తెలిసిందే. మొత్తానికి అఖిల్ చాలా పవర్ఫుల్ గా కనిపించబోతున్నట్లు అర్థమయింది. ఇప్పటివరకు ఒక లెక్క ఏజెంట్ తర్వాత మరొక లెక్క అనే విధంగా సినిమాలో అఖిల్ హై వోల్టేజ్ లుక్కుతో అయితే కనిపించాడు. ఇక ఈ సినిమాలో ఒక షాట్ పై చాలా మంది ట్రోలింగ్ కూడా చేయడం మొదలు పెట్టేసారు.

ఏజెంట్ అంటే ఒక అజ్ఞాత గూడాచారి అని సినిమా టీజర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే చుట్టూ విలన్స్ అతనిపై ఫైరింగ్ చేస్తుంటే హీరో మాత్రం డాన్స్ చేసుకుంటూ ఫన్నీగా అలా కాల్చడం ఏమిటి అనే కామెంట్స్ అయితే చాలానే వస్తున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ లో ఈ ఒక్క షాట్ తో కూడా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉందని ఓవర్గం వారి అభిప్రాయం చేస్తున్నారు. కానీ దాని వెనుక ఒక కారణం ఉందని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి మేకింగ్ ను తక్కువంచాన వేయడానికి వీల్లేదు. 

గతంలో కిక్ అలాగే రేసుగుర్రం సినిమాల్లో కూడా హీరోను యాక్షన్ లో చూపిస్తూనే మధ్యలో ఒక సైకో తరహా ఎలివేషన్ కూడా ఇప్పించాడు. కాబట్టి అఖిల్ పాత్ర ఎలాంటిదో అతను అలా ప్రవర్తించడానికి రీసన్ ఉండే ఉంటుంది అని అనిపిస్తుంది. అంతేకాకుండా చివరి షాట్ లో అఖిల్ బుల్లెట్ల వర్షం కురుస్తున్న కూడా బూతులు మాట్లాడుకుంటూ ఎదురుగా వెళ్లడం చూస్తుంటే ఇందులో అతను ఏజెంట్ క్యారెక్టర్ లో ఒక సైకోతనాన్ని చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా వరల్డ్ లో ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post