ది వారియర్ కథను రిజెక్ట్ చేసిన ఇద్దరు హీరోలు!


తమిళ దర్శకుడు లింగస్వామి పందెంకోడి, రన్ సినిమాలతో  మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. తెలుగులో ఆవారా సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి అతని సినిమాలు అన్ని కూడా ఏదో అదృష్టం కొద్ది సక్సెస్ అయ్యాయి. ఆ కమర్షియల్ సినిమాలకు యాక్షన్ ఎపిసోడ్స్ వర్కౌట్ కాకపోతే మాత్రం రొటీన్ సినిమాలని చెప్పవచ్చు. 

ఇక రామ్ పోతినేని ది వారియర్ సినిమా చేసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు అనేది పెద్ద మిస్టరీ. ఇక ఆ సినిమా కథ చెప్పగానే ట్వీట్ చేసి హ్యాపీగా థ్రిల్ అయినట్లు చెప్పిన రామ్ ఎందుకంత ఎగ్జైట్ అయ్యాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. లింగుస్వామి తప్పకుండా బాగా చేస్తాడు అని తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వవచ్చు అనుకున్నాడేమో కానీ రామ్ అయితే తన వరకు బాగా కష్టపడినప్పటికీ లింగస్వామి మేకింగ్ అయితే చాలా రొటీన్ చెప్పవచ్చు.

అయితే ఈ కథను ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ లకు కూడా చెప్పి ఒప్పించాలి అని దర్శకుడు ప్రయత్నాలు చేశాడు. కానీ వివిధ కారణాల వల్ల ఇద్దరు హీరోలు ఆ కథను రిజెక్ట్ చేసి మంచి పని చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ తో అయితే దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు కథను మార్చుకుంటూ తెలుగు తమిళ్ ఒకేసారి తీయాలి అని లింగస్వామి ప్రయత్నాలు చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక ప్రస్తుతం ఫామ్ లో లేని లింగస్వామి ది వారియర్ సినిమాతో మరింత వెనుకబడిపోయాడు.

Post a Comment

Previous Post Next Post