అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సెకండ్ పార్ట్ కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత మరొక పాయింట్ తో కూడా దర్శకుడు కథను కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినిమాలో నటించిన ఫాహాద్ ఫాజిల్ ఆ విషయంపై స్పందించారు. రీసెంట్గా సుకుమార్ గారు ఫోన్ చేసి పుష్ప మూడో భాగం కూడా ఉండవచ్చు అని అందుకు తగ్గట్టు పాయింట్ కూడా అనుకున్నట్లు వివరణ ఇచ్చినట్లు ఫాహాద్ తెలియజేశాడు. సుకుమార్ అయితే కాన్ఫిడెంట్ గా చెప్పలేదు కానీ తప్పకుండా పుష్ప 3 ఉండే అవకాశం ఉన్నట్లు మాత్రం ఆయన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే అల్లు అర్జున్ పుష్ప సినిమాతోనే ప్రభాస్ స్థాయిని అందుకునేలా ఉన్నాడు అనిపిస్తోంది.
Follow
Post a Comment