యువ హీరోతో నిత్యామీనన్ పెళ్లి?


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. ప్రస్తుతం అయితే ఆమె న్యూ ప్రాజెక్ట్‌లు ఏవీ సైన్ చేయడం లేదు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నిత్యా మీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది.
నిత్యా మీనన్ చివరిగా తెలుగు చలనచిత్రం భీమ్లా నాయక్‌లో నటించింది.

ఇటీవల అమెజాన్ ప్రైమ్ మోడరన్ లవ్ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ఇక నిత్యా మీనన్ పెళ్లి విషయంలో పెద్ద ప్లాన్ చేస్తోందని, త్వరలోనే ఆమె పెళ్లి కావచ్చని ఇప్పుడు చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అదికూడా మలయాళ చిత్ర పరిశ్రమలోని ఓ స్టార్ హీరోతో పెళ్లి పీటలు ఎక్కనుందని టాక్.  ప్రస్తుతం ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి వివరణ లేదు. మరి ఆ లక్కీ హీరో ఎవరో కాలమే సమాధానం చెప్పాలి.

Post a Comment

Previous Post Next Post