కాజల్ సాకుతో ఆచార్యకు జెమిని దెబ్బ?


ఒక సాధారణ ఫ్లాప్ సినిమాకు కూడా రాని కష్టాలు ఆచార్య సినిమాకి వస్తున్నాయి. అసలు ఈ సినిమా సక్సెస్ కాకపోయినా కనీసం ఒక మిడ్ రేంజ్ లో అయినా అడుతుందని అనుకుంటే అది లేదు. ఎంత చెత్త సినిమా అయినా సరే శాటిలైట్ రూపంలో ఎంతోకొంత లాభాలు తెస్తుంది. కానీ ఆచార్య సినిమాకి ఆ భాగ్యం కూడా లేదు. 

కొరటాల శివ మధ్యలో పెద్దతలగా వ్యవహరించి డిస్ట్రిబ్యూషన్ చేయడంతో ఊహించని విధంగా బయ్యర్లకు తన జేబులోంచి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు శాటిలైట్ ద్వారా వస్తాయని అనుకున్న 15 కోట్లు కూడా రాలేని పరిస్థితి. జెమిని టీవీ ఆచార్య హక్కులను 15 కోట్ల డీల్ కు సెట్ చేసుకుంది. కాని ఇప్పుడు జెమిని వాళ్లకు ఆచార్య సినిమా ద్వారా యాడ్స్ ఆదాయం లేకపోవడంతో ఆ డీల్ కాన్సిల్ చేసుకోవాలని చూస్తుంది. సాధారణంగా డీల్ సెట్ చేసుకున్నాక రేటింగ్ తో సంబంధం లేకుండా పేమెంట్ ఇచ్చేయాలి. కానీ  డీల్ సెట్ అవ్వడానికి ముందు సినిమాలో కాజల్ ఉంది. కానీ రిలీజ్ అయ్యాకా కాజల్ లేదు. కాబట్టి అనుకున్న డీల్ లో సగం అంటే 7.5 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని అదొక సాకుతో డీల్ లో మార్పులు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post