పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ అంశాలతో చాలా బిజీగా ఉంటూనే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరోవైపు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అసలైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళకుంటే మాత్రం ప్రస్తుతం అతని స్టార్ హోదా మరొక రేంజ్ లో ఉండేది. ఇప్పటికే అతను చాలా తక్కువ క్యాల్షిట్స్ ఇచ్చి ఎక్కువ స్థాయిలో పారితోషికం అయితే అందుకుంటున్నాడు.
ఒక విధంగా పవన్ కు అయితే మార్కెట్ లో అంత డిమాండ్ ఉంది. అయితే రీసెంట్గా వచ్చిన ఏజెంట్ సినిమా టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కు మాత్రం ఒక విధంగా గట్టి దెబ్బ పడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సింది. కానీ ఫుల్ బిజీ గా ఉండడంతో ఆ సినిమా చేయలేని పరిస్థితి ఏర్పడింది. నిజంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసి ఉంటే కనుక ఆ సినిమా మరొక రేంజ్ లో ఉండేది. కానీ పవన్ మాత్రం తొందరగా అయిపోయే వినోదయ సీతం రీమేక్ ను మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆ విషయంలో కొంత అప్సెట్ అవుతున్నారు.
Follow
Post a Comment