భార్యకు 9 కోట్ల కానుక ఇచ్చిన ఎన్టీఆర్!


టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. RRR సినిమాతోనే దాదాపు 50 కోట్ల పారితోషికాన్ని సొంతం చేసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలోనే తదుపరి సినిమాలకు డిమాండ్ చేయబోతున్నాడు.

అయితే ఈ క్రమంలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తన భార్య కోసం ప్రత్యేకంగా ఒక ఫామ్ హౌస్ ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కు దగ్గరగా ఉన్న 6 నుంచి 7 ఎకరాల మధ్యలో పొలాన్ని కొనుగోలు చేసిన తారక్ దాన్ని తోటలా మర్చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ భార్య ఇష్టానుసారంగా ఒక అందమైన విల్లాను కూడా అందులోనే నిర్మించారట. ప్రస్తుతం ఖాళీ సమయాల్లో ఎన్టీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి తన ఫ్యామిలీ తో కలిసి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post