నాని 'దసరా' బిల్డప్.. లవ్ స్టొరీయే కానీ?నేచురల్ స్టార్ నాని తన ఆశలన్నీ మొత్తం దసరా సినిమా పైన పెట్టుకున్నాడు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత కొంతకాలంగా నాని ఇలాంటి సినిమా చేసిన పెట్టిన పెట్టబడిన అయితే వెనక్కి తీసుకురాలేదు. థియేట్రికల్ గా అతని సినిమాలు పెద్దగా ప్రాఫిట్స్ అందించింది లేదు. 

అందుకే దసరా సినిమాకు పెరుగుతున్న బడ్జెట్ కారణంగా ఎన్నో అనుమానాలు వెలువడుతున్నాయి.  అయితే నాని ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఇదేదో పుష్ప సినిమాకు మరొక వెర్షన్ లా ఉంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే నాని లుక్ కూడా అదే తరహాలో ఉంది. మొదట అందరూ ఈ సినిమాలో పవర్ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండవచ్చి అనుకున్నారు.

కానీ నిజానికి ఇది లవ్ స్టోరీ అని తెలుస్తోంది. నాని ఇందులో ఒక స్లమ్ ఏరియాలో నివసించే మాస్ కుర్రాడు అని తెలుస్తోంది. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం ఒక ధనవంతుడి కూతురుగా కనిపించబోతుందట. ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాను ఒక ప్యూర్ ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. 

సుకుమార్ శిష్యుడే కాబట్టి తప్పకుండా అతను ఎంచుకున్న కదా డిఫరెంట్ గానే ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో నిర్మాతలు కాస్త కంగారు పడినప్పటికీ నాని ముందుగా పారితోషికం తీసుకోకుండా సినిమాకు కావాల్సిన బడ్జెట్ సమకూర్చమని రిక్వెస్ట్ చేశాడట. ఇక నానిని నమ్మి నిర్మాతలు కూడా భారీగానే పెట్టుబడి పెడుతున్నారు.   సినిమా ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post