హఠాత్తుగా హాట్ స్టార్ లో RRR.. ఈ డీల్ ఎలా?


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో కూడా మంచి క్రేజ్ అందుకుంది. నెట్ ఫ్లిక్స్ హిందీ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ హక్కులను జి 5 సొంతం చేసుకుంది. కానీ హిందీలో సక్సెస్ అయినంతగా మిగతా భాషల్లో సినిమా పెద్దగా లాభాన్ని తెచ్చింది లేదు. 

అయితే ఈ క్రమంలో హఠాత్తుగా RRR సినిమా తెలుగు వెర్షన్ హాట్ స్టార్ డిస్ని ప్లస్ లో దర్శనమైంది. ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైన తొలి సినిమాగా RRR రికార్డును క్రియేట్ చేసింది. అయితే దర్శకుడు రాజమౌళి కరెక్ట్ గా ఆలోచించి RRR సినిమాకు ఒకవైపు లాభాలు వస్తూనే మరొకవైపు ఓటీటీ ద్వారా జనాలకు చాలా దగ్గరవ్వాలి అని డిసైడ్ అయ్యాడు.

ఇక నెట్ ఫిక్స్ అయితే ఆ విషయంలో బాగానే సక్సెస్ అయింది. కానీ జీ ఫైవ్ కు మాత్రం పెద్దగా లాభం వచ్చింది లేదు. ఈ క్రమంలో మళ్లీ ZEE5 తో మరొకసారి చర్చలు జరిపి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ హక్కులను హాట్ స్టార్ డిస్నీ ప్లస్ కు అమ్మినట్లుగా తెలుస్తోంది. మరి ఈ రూట్ లో సినిమా ఇంకా ఏ స్థాయిలో రీచ్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post