యాక్టింగ్ ఎంట్రీపై నిహారిక భర్త క్లారిటీ


నిహారిక కొణిదెల తన రేవ్ పార్టీతో అలాగే తన భర్త చైతన్యతో విడిపోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం వార్తల్లో నిలిచింది. అయితే ఆ పుకార్లన్నింటినీ ఈ జంట కొట్టిపారేసింది. ఇప్పుడు ఈ జంట యాంకర్ నిఖిల్‌తో కలిసి ఒక యూట్యూబ్ షోలో పాల్గొంది. సినిమాల్లోకి రావడం గురించి చైతన్య ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు.

గతంలోనే చైతన్య కూడా సినిమాల్లోకి రాబోతున్నాడు అని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ గా చైతన్య జొన్నలగడ్డ ఒక్క మాటలోనే యాక్టింగ్ పై వివరణ ఇచ్చారు.
తనకు సినిమాల్లోకి రావడం ఏ మాత్రం ఇష్టం లేదని చైతన్య తేల్చి చెప్పేశాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో తనకు రామ్ చరణ్ నటన అంటే చాలా ఇష్టం అని అన్నాడు. మరోవైపు నిహారిక, చైతన్య పలు వెబ్ సీరీస్ లు నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ లో మాత్రం విభిన్నమైన కాన్సెప్ట్ లతో రావాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

Post a Comment

Previous Post Next Post