రామ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుందట?


తెలుగు తమిళంలో ఒకేసారి సక్సెస్ అందుకోవాలి అనుకున్న రామ్ పోతినేని ఆశలు అన్నీ కూడా దివారియర్ సినిమాతో చెల్లా చెదురైపోయాయి. ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చడానికి ఎంతో సమయం పట్టలేదు. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే అందుకున్నప్పటికీ కూడా రెండవ రోజు దాదాపు 60 శాతానికి పైగా కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి.
అయితే ఈ సినిమా బడ్జెట్ దృశ్య రామ్ పోతినేని ముందుగానే పారితోషికం తీసుకోలేదట. 

బిజినెస్ అనంతరం మాట్లాడుకుందామని దర్శకుడు హీరో నిర్మాతలతో ముందుగానే ఒక ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా పరిస్థితి చూస్తుంటే నిర్మాతలకు చిల్లి గవ్వ కూడా లాభం వచ్చేలా లేదనిపిస్తోంది. ఇక హీరోయిన్ కృతి శెట్టికి మాత్రం ముందుగానే రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

బంగార్రాజు సినిమాతోనే కోటిన్నర వరకు తీసుకున్న ఈ బ్యూటీ అప్పుడు డిమాండ్ ను బట్టి రెండు భాషల్లో తెరకెక్కే సినిమా అని ది వారియర్ కు రెండు కోట్ల వరకు డిమాండ్ చేసిందట. దీంతో హీరో కంటే ఒక విధంగా ముందుగానే ఈ బ్యూటీకి ఎక్కువ పారితోషికం దక్కింది. ఇక రామ్ మార్కెట్ ప్రకారం 8కోట్ల వరకు తీసుకోవాలి. కానీ ది వారియర్ పరిస్థితి చూస్తుంటే థియేట్రికల్ గా 15 కోట్లకు పైగా నష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఈ సమయంలో రామ్ ఏమైనా డిమాండ్ చేస్తాడో లేదో చూడాలి మరి.

Post a Comment

Previous Post Next Post