మహేష్.. మెస్సేజ్ లేకుండా పొలిటికల్ టచ్!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ సిద్ధమయ్యే వరకు కూడా మహేష్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాబట్టి సినిమా కథ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


అయితే ఈ సినిమాలో కూడా కొన్ని రాజకీయ అంశాలు ఉంటాయట. మహేష్ బాబు గత కొన్ని నెలలుగా తన ప్రతి సినిమాలో మంచి సందేశం తో పాటు ఏదో ఒక సందర్భంలో పొలిటికల్ అంశాలను కూడా టచ్ చేస్తున్నాడు. దూకుడు సినిమాలో ఫేక్ ఎమ్మెల్యేగా ఆ తరువాత భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి గా కనిపించి బాక్సాఫీస్ హిట్ కొట్టేశాడు. ఇక ఈసారి SSMB28 లో మెస్సేజ్ లేకుండా ఒక బలమైన పొలిటికల్ అంశాన్ని టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post