ఎన్టీఆర్ కోసం ప్రాణమిచ్చే బామ్మర్ది కావాలట!


జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వెంటనే తన 30వ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అనుకున్నాడు. కానీ ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టుకోకపోవడం విశేషం. దర్శకుడు కొరటాల శివకు ఆచార్య దెబ్బ అప్సెట్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఇక మొత్తానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో నటీనటులను ఫైనల్ చేసే విషయంలో కూడా దర్శకుడు ఎన్టీఆర్ తో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ బావమరిది పాత్ర కోసం ఒక యువ హీరోని తీసుకోవాలని అనుకుంటున్నారట. కథలో చాలా ఎమోషనల్ గా పవర్ఫుల్ గా ఉండే ఆ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందట. అయితే మొన్నటి వరకు సాయిధరమ్ తేజ్ నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ నిజానికి అయితే అతన్ని సంప్రదించలేదు అని తెలుస్తోంది. త్వరలోనే దర్శకుడు నటీనటుల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని డిసైడ్ అయినట్లుగా టాక్. మరి ఎన్టీఆర్ బావమరిది పాత్ర కోసం ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post