నాని దసరా.. మహానటి రెమ్యునరేషన్ ఎంతంటే?


నాని నటిస్తున్న దసరా సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు నాని ముందుగా అయితే రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ అయితే లాభాల్లో వాటా అందుకునే విధంగా నిర్మాతతో చర్చలు జరిపాడు. అందుకు కారణం బడ్జెట్ ఊహించిన విధంగా ఎక్కువ అవుతుందట.


ఇక మిగతా వారికి మాత్రం నిర్మాతలు అనుకున్నట్లే  హై రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తన గ్లామర్ డోస్ ను పక్కనపెట్టి హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక అందుకు గాను ఆమెకు దాదాపు మూడు కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు మహానటి కెరీర్ లోనే ఇది అత్యధిక రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post