రాశి ఖన్నా.. ఇప్పుడైనా పక్కానా?


క్యూట్ బబ్లీ గర్ల్ రాశి కన్నా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు బాగానే అందుకుంది. ఇక 2020లో ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ తో మొదటిసారి చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ అవకాశాలు రావేమో అన్నంతగా ట్రోలింగ్ అయితే జరిగింది. 

అయినప్పటికీ కూడా ఈ బ్యూటీ తమిళ్ మలయాళం లో కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక ఈ ఏడాది ఒకే నెలలో రెండు సినిమాలతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇటీవల విడుదలైన పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు తన ఆశలన్నీ కూడా థాంక్యూ సినిమా పైనే ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే ఆ సినిమాకు పెద్దగా హైప్ కూడా లేదు. రెగ్యులర్ ప్రమోషన్స్ లో అయితే రాశి బాగానే పాల్గొంటోంది. మరి ఈ సినిమా ఆయినా అమ్మడికి గ్యారెంటీ రిజల్ట్ ను అందిస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post