ఆచార్య ఎఫెక్ట్.. కొరటాల ఆఫీస్ దగ్గర ఆందోళన?


ఆచార్య సినిమా కొరటాల శివకు ఏ విధంగాను లాభాన్ని చేకూర్చలేకపోయింది. వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న కొరటాల శివ ఒక్కసారిగా ఆ సినిమాతో ఆర్థికంగానే కాకుండా కెరీర్ పరంగా కూడా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా మధ్యలో చర్చలు జరిపినందుకు ఇప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కొరటాల శివ ఆధ్వర్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ వ్యవహారాలు జరిగినట్లు టాక్.

ఇక ఆచార్య సినిమా బయర్లకు దాదాపు 80 శాతానికి పైగా నష్టాలను కలిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొంతమంది బయ్యార్లు కొరటాల శివ ఆఫీస్ దగ్గర బైఠాయించినట్లు తెలుస్తోంది. సీడెడ్ బయ్యర్, సెకండరీ బయ్యర్లు నిన్న రాత్రి నుంచే కొరటాల శివ ఆఫీస్ దగ్గరే బైఠాయించారు. 15 కోట్ల నష్టానికి ఎంత వెనక్కి ఇస్తారో తేల్చనిదే ఇక్కడ నుంచి కదలలేము అని చెబుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొరటాల శివ తేల్చకపోతే మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు కూడా వెళ్తామని వారు హెచ్చరిక చేసినట్లుగా సమాచారం. మరి ఈ విషయంలో కొరటాల శివ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి
.

Post a Comment

Previous Post Next Post