250కోట్లు వచ్చినా.. త్రివిక్రమ్ ను నమ్మట్లేదు!


త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి దర్శకుడే కానీ కాపీ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మొదటి సినిమా తప్పితే ఆ తరువాత చాలా వరకు త్రివిక్రమ్ తస్కరించినవే ఎక్కువ. ఇక అజ్ఞాతవాసి సమయానికి కాపీ దెబ్బ గట్టిగా తగిలింది. ఇక అల.. వైకుంఠపురములో.. సినిమాతో ఏకంగా 250కోట్ల బాక్సాఫీస్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

ఆ సినిమా మేయిన్ ప్లాట్ కూడా ఎన్టీఆర్ మంచి మనిషి సినిమా ఆధారంగా తెరకెక్కించింది. ఏదేమైమా త్రివిక్రమ్ ప్లాన్ బెడిసికొడితే మామూలుగా ఉండదని మహేష్ అర్థం చేసుకున్నాడో ఏమో గాని అతని కథను అంత ఈజీగా ఒప్పుకోలేదు. ఒకసారి దుబాయ్ లో ఉండగా కథ చెప్పాడు. మరోసారి అమెరికా వెళ్ళాడు. ఇక మహేష్ ఇటీవల స్వదేశానికి రాగానే మళ్ళీ మరోసారి చెప్పి ఒప్పించాడు. ఏదేమైనా మహేష్ మాత్రం త్రివిక్రమ్ ను అంత ఈజీగా నమ్మలేదు అనే చెప్పాలి. ఇక వీరి కలయికలో రెగ్యులర్ షూట్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది.

Post a Comment

Previous Post Next Post