నాగచైతన్యను కాదని... రామ్ తో క్రియేటివ్ డైరెక్టర్?


క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం 'వెందు తనింధతు కాదు' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధి ఇద్నాని కయదు లోహర్, నీరజ్ మాధవ్ కూడా ఉన్నారు.  అయితే గతంలో ఆ దర్శకుడు శింబుతో ఎలాంటి సినిమా చేసినా ఆ సినిమాలను ఒకేసారి తెలుగులో నాగచైతన్య తో చేశాడు.

అయితే ఈసారి గౌతమ్ వాసుదేవ్ మీనన్, నాగ చైతన్యతో కాకుండా శింబు చేస్తున్న చిత్రాన్ని రామ్ తో రీమేక్ చేయాలనుకుంటున్నారట.  ఈ ఆసక్తికరమైన యాక్షన్ డ్రామా కోసం రామ్ పోతినేనితో ఇదివరకే చర్చలు జరుపుతునట్లు సమాచారం. గతంలోనే రామ్ గౌతమ్ వాసుదేవ్ చెప్పిన కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు మెల్లగా పాన్ ఇండియా ఫార్మాట్ లోకి వెళుతున్న రామ్ గౌతమ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post