డాడీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ రీ ఎంట్రీ?


డాడీ సినిమాలో.మెగాస్టార్ చిరంజీవి గారాల కుతురిగా నటించిన చిన్నారి అందరికి గుర్తుండే ఉంటుంది. 2001లో గీత ఆర్ట్స్ లో సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికి కూడా ఓ వర్గం ఫ్యామిలీ ఆడియెన్స్ ను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ కూతురిగా ఐశ్వర్య, అఖిల అనే రెండు పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టీస్ట్ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.


అయితే ఆ సినిమా అనంతరం ఆమె మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. ఒక హిందీ సినిమాలో నటించిన అనంతరం 2002 నుంచి మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. ఆమె అసలు పేరు అనుష్క మల్హోత్రా. ప్రస్తుతం పాతికేళ్ల వయసును దాటిన ఆమె త్వరలోనే మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట. ఒక కన్నడ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకోసం డ్యాన్స్, అలాగే ఇతర నటనకు సంబంధించిన విషయంలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post