రెమ్యునరేషన్ తగ్గించుకునేందుకు ముగ్గురు స్టార్ హీరోలు రెడీ!


తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల నిర్మాణ సంస్థలు ఒక విషయంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరమైతే వ్యక్తం చేస్తున్నాయి. బిజినెస్ చాలావరకు తగ్గిపోయింది. ఈ తరుణంలో కాస్ట్ వాల్యూ మాత్రం చాలా ఎక్కువగా పెరుగుతోంది  ముఖ్యంగా అగ్ర హీరోల పారితోషికం అనేది అలాగే మేకింగ్ అనేది కూడా పెరిగిపోవడం నిర్మాతలపై పెనుబారాలను చూపిస్తోంది.

సినిమాలు ఏమాత్రం తేడా కొట్టినా కూడా ఊహించని రేంజ్ లో డిజాస్టర్ అవుతున్నాయి. అయితే ఇటీవల అగ్ర నిర్మాతలు కొందరు ప్రముఖ హీరోలతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ తరుణంలో కొందరు రెమ్యునరేషన్స్ తగ్గించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అందులో ముందుగా దిల్ రాజు గిల్డ్ సమావేశం జరిపిన తర్వాత అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురు కూడా వారి పారితోషకాలను తగ్గించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా ప్రస్తుతం దాదాపు 50 నుంచి 70 కోట్ల మధ్యలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మరి అందులో ఎంతవరకు తగ్గిస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post