బన్నీ త్రివిక్రమ్ పార్ట్ టైమ్ జాబ్.. మంచి సంపాదన!


ఈ రోజుల్లో స్టార్ హీరోలైనా దర్శకులైనా కూడా బలమైన కంటెంట్ తో వస్తే డబ్బు సంపాదించుకునేందుకు చాలా మార్గాలు ఏర్పడుతున్నాయి. ఇక కమర్షియల్ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా మామూలు రావడం లేదు. ఒకటి లేదా రెండు రోజుల్లో చేసే యాడ్స్ కోసం కొందరు పదుల కోట్లు సంపాదిస్తున్నారు. ఒక విధంగా వారికి ఇది పార్ట్ టైమ్ జాబ్ లాంటిది అని చెప్పవచ్చు.

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు కొన్ని కమర్షియల్ యాడ్స్ చేసే అవకాశం ఉందట. రీసెంట్ గా అల్లు అర్జున్ ఒక ప్రముఖ కంపెనీ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో షూట్ చేసిన ఆ యాడ్ షూట్ రామోజీ ఫిల్మీ సిటీలో జరిగింది. ఇక ఈ యాడ్ కోసం బన్నీ 15 కోట్లకు పైగానే అందుకున్నాడట. అది కూడా రెండు సంవత్సరాల అగ్రిమెంట్ ద్వారానే. ఇక త్రివిక్రమ్ 3 కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం. ఏదేమైనా పుష్ప సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ అందుకోవడంతో బన్నీ కి డిమాండ్ బాగానే పెరిగింది. దీంతో కొన్ని పాపులర్ కంపెనీల యాడ్స్ లో నటిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post