నాని, స్పైడర్.. మహేష్ బ్యాడ్ సెంటిమెంట్?


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా లేదా అనేది పెద్ద సందేహంగానే ఉంది. ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు మొదలుపెట్టడానికి ఇంకా మహేష్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఫైనల్ స్క్రిప్ట్ పనులు ఇంకా జరుగుతున్నట్లుగా అనేక రకాల కథనాలు నిలబడుతున్నాయి. మరోవైపు రాజమౌళితో వచ్చే ఏడాది మరో కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. 

అయితే ఈ తరుణంలో మహేష్ బాబుకు మరో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజు ఒక కథను చెప్పినట్లుగా ఇటీవల టాక్ అయితే వినిపించింది. అయితే గతంలో మహేష్ బాబు తమిళ దర్శకులతో చేసిన ప్రతిసారి కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ఎస్ జె సూర్యతో చేసిన నాని సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఏఆర్.మురగదాస్ తో ఎంతో ఇష్టంగా చేసిన స్పైడర్ సినిమా కూడా బెడిసి కొట్టింది. ఇక ఇప్పుడు లోకేష్ కనగరాజు మహేష్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ ప్రతిసారి కూడా అలాంటి బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవ్వదని ప్రేక్షకులు ఈ కాంబినేషన్ పై నమ్మకంగా ఉన్నారు. ఇక వీరి కలయికపై అఫీషియల్ గా క్లారిటీ రావడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post