కెరీర్ విషయంలో కాజల్ కీలక నిర్ణయం!


టాలీవుడ్ చందమామ సీనియర్ నటి కాజల్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.  ఆమె ఇటీవలే తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసింది. ఇక ఇప్పుడు తన భర్త గౌతమ్‌తో కలిసి ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా అనుభవిస్తోంది. ఇదిలా ఉంటే కాజల్ టాలీవుడ్‌ ద్వారా రీ ఎంట్రీని జాగ్రత్తగా ప్లాన్ చేస్తోందని టాక్.

ఇంకా ఆమె కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేయలేదు. చర్చలు అయితే కొనసాగుతున్నాయట. సరైన స్క్రిప్ట్‌ కోసం ఆమె ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏడాదిలోగా కాజల్ మళ్ళీ జెట్ స్పీడ్ లోనే రీ ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని యువ దర్శకులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అంటే ఆమె దాదాపు గ్లామరస్ హీరోయిన్ పాత్రలకు రిటైర్మెంట్ ఇచ్చినట్లే అని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post