అల్లు అర్జున్ తమిళంలో లింగుసామి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అప్పట్లో చర్చలు కూడా గట్టిగానే జరిగాయి. కానీ ఆ సినిమా అస్సలు పట్టాలెక్కలేదు. ఇప్పుడు లింగుసామి రామ్‌తో తన కొత్త చిత్రం ది వారియర్ విడుదలలో బిజీగా ఉన్నందున, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఈ ప్రశ్నలపై లింగుసామి స్పందిస్తూ, తాను అల్లు అర్జున్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నానని, ఈ ప్రాజెక్ట్ నిలిపివేయబడలేదని, సమీప భవిష్యత్తులో తప్పకుండా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్‌తో పుష్ప 2తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక లింగుస్వామి ఐకాన్ స్టార్‌ని డైరెక్ట్ చేయాలంటే తప్పకుండా ది వారియర్ సినిమాతో సక్సెస్ కొట్టాల్సిందే. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment