రామారావు బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?


రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ఫుల్ సివిల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఒక క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో వస్తున్న సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులైతే చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 18 కోట్ల టార్గెట్ తో విడుదలకు సిద్ధమైంది. దాదాపు వెయ్యికి పైగా థియేటర్స్ లలో విడుదల కానుంది. ప్రస్తుత కాలంలో సినిమాల పరిస్థితి చూస్తూ ఉంటే మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే గాని మిగతా రోజుల్లో నిలకడగా ఉండడం లేదు. అలాగే వాతావరణం కూడా ప్రస్తుతం సినిమాలకు కొంత శాపంగా మారింది. వర్షాల ప్రభావం పెద్దగా లేకపోతే రామారావు సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉంటుంది. ఇక సినిమా టాక్ ను బట్టి కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకునే ఛాన్స్ ఉంటుంది  మరి సినిమా టోటల్ గా ఏ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post