ప్రభాస్ ప్రాజెక్ట్ K రిలీజ్.. రెండు పండగలపై టార్గెట్?


ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై ప్రస్తుతం ఒక టాక్ వైరల్ గా మారుతోంది. 

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ K 2023 అక్టోబర్ 18న రిలీజ్ కావచ్చని తెలుస్తోంది.  లేదంటే 2024 జనవరిలో రావచ్చని టాక్. ప్రస్తుతం సినిమా షూటింగ్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది జనవరికి షూటింగ్ పనులు ఫినిష్ చేసి మరో 5 నెలల వరకు గ్రాఫిక్స్ అలాగే మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నారు. అందుకు 8 నెలల సమయం కూడా పట్టవచ్చు. కాబట్టి సినిమాను అందుకు తగ్గ ప్లాన్ వచ్చే దసరా లేదా సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post