ఎందయ్యా రవితేజ ఇలా చేస్తున్నావ్?


వరుస అపజయాలు ఎదురవుతున్న సమయంలో ఏ హీరో అయినా సరే కాస్త ఆలోచించే మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక రవితేజ కూడా రాజా ది గ్రేట్ ముందు వరకు కూడా అదే తరహాలో ఆలోచించాడు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన రాజా ది గ్రేట్ సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించి మళ్లీ ట్రాక్ లేక తీసుకువచ్చింది. 

అయితే అదే సినిమాతో మాస్ రాజా కమర్షియల్ ఫార్మాట్లకు వెళ్లకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు అనే గుర్తింపును కూడా అందుకున్నాడు. కానీ మళ్ళీ ఎప్పటిలానే ఆయన అదే తరహా జానర్స్ కొనసాగిస్తున్నాడు. టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఇక మధ్యలో డిఫరెంట్ గా ట్రై చేయాలని చేసిన డిస్కో రాజా కూడా తేడా కొట్టేసింది.

ఇక అదృష్టవశాత్తు క్రాక్ సినిమా మంచి సమయంలో విడుదల కావడంతో మాస్ కమర్షియల్ ఆడియన్స్ మెప్పించింది. ఇక ఆ సినిమాతో అయినా సెట్ అవుతాడు అనుకున్న రవితేజ మళ్ళీ ఖిలాడీ సినిమాతో తప్పటడుగు వేశాడు. పోనీ ఆ సినిమా క్రాక్ కంటే ముందే కమిట్మెంట్ ఉన్నప్పటికీ రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ప్రస్తుతం అభిమానుల్లో ఆవేశాన్ని రగిలిస్తోంది.

ఎంతోమంది టాలెంటెడ్ కొత్త దర్శకులు ఉన్నారు కానీ శరత్ మండవ ఇదివరకే తమిళంలో డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు. కానీ అతనికి పరిచయాలు ఎక్కువగా ఉండడంతో రవితేజ రిస్క్ చేసి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా చూసిన ఆడియన్స్ అయితే రవితేజ పై చాలా అప్సెట్ అవుతున్నారు. ట్రాక్ లోకి వచ్చాడు అనుకున్నా ప్రతిసారి కూడా అనవసరమైన కథలను సెలెక్ట్ చేసుకునే నిరాశపరచడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెబుతున్నారు. ఇక రాబోయే సినిమా లైనప్ లో రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఎంతవరకు క్లిక్ అవుతాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post