పెళ్లి సందD బ్యూటీకి ఎన్ని ఆఫర్లో..


పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీలీల అతి తక్కువ కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా మంచి అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ ధమాకా సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే. అలాగే గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి మొదటి సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది

నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు,  వైష్ణవ్ తేజ్ 4 సినిమాలో అలాగే వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న తదుపరి చిత్రంలో కూడా ఆమె కథానాయికగా నటించడానికి సిద్ధమైంది. అలాగే అనిల్ రావిపూడి తదుపరి చిత్రంలో ఆమె నందమూరి బాలకృష్ణ కుమార్తెగా కనిపించబోతోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 28 లో సెకండ్ హీరోయిన్ గా కీలక పాత్ర పోషించే ఛాన్స్ వచ్చిందని టాక్. రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ రెడ్డి యొక్క తదుపరి చిత్రం సెల్ఫిష్‌లో కూడా కథానాయికగా నటించడానికి శ్రీ లీల చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post