నాగచైతన్య న్యూ ప్రాజెక్ట్.. ఈసారి 40కోట్లు?


నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా దాదాపు డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని దిల్ రాజు ముందే ఊహించినట్లు ఉన్నారు. అందుకే పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఇక సినిమా విడుదలైన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు కూడా కనీసం సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా వేయడం లేదు.

ఇక దాదాపుగా సినిమా థియేట్రికల్ బిజినెస్ ద్వారా దిల్ రాజు 15 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మరొకవైపు నాగచైతన్య నుంచి రాబోయే తదుపరి ప్రాజెక్టు కోసం మాత్రం 40 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఇక ప్రాజెక్టును డైరెక్ట్ చేసేది మరెవరో కాదు థాంక్యూ దర్శకుడు విక్రమ్ కుమార్. ఇదివరకే వీరు దూత వెబ్ సిరీస్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

అయితే అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. హారర్ కాన్సెప్ట్ లో రాబోతున్న ఈ సినిమా మేకింగ్ కంటే ఎక్కువగా నటీనటుల పారితోషికాలకు ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. అయితే థాంక్యూ ప్రభావం ఈ సినిమాపై కొంత పడే అవకాశం ఉన్నప్పటికీ హారర్ కాన్సెప్ట్ కాబట్టి ట్రైలర్ కనెక్ట్ అయితే ఆడియన్స్ ఎగబడి చూసే అవకాశం ఉంటుంది. మరి ఆ రూట్ లో అయినా ఈ కాంబో సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post