Type Here to Get Search Results !

Thank You Movie - Review & Rating


కథ:
అభిరామ్ (నాగ చైతన్య) కార్పోరేట్ సంస్థలో ఒక ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కనే వ్యక్తి. అయితే తన అనుకున్న డ్రీమ్ ను సాధించిన తర్వాత.. కొన్ని ఆలోచనల వలన తన ప్రయాణంలో ఎన్నో మంచి విషయాలను మర్చిపోతాడు. అతని ప్రయాణంలో ఎంతోమంది సహాయపడినా కూడా గుర్తుంచుకొడు. ఇక అతనికి ఆర్థికంగా మద్దతునిచ్చే ప్రియ (రాశి ఖన్నా) ఎదురవుతుంది. ఆమె అతని విజయవంతమైన జీవితంలో భాగమవుతుంది. కానీ అభి అటిట్యూడ్ దగ్గరగా ఉన్నవారిని నుండి దూరం చేస్తుంది. అయితే హఠాత్తుగా ఒక సంఘటన అభి తనకు సహాయ పడిన వారికి కృతజ్ఞతలు చెప్పేలే ఆలోచనను కలిగిస్తుంది.  ఇక అభిరామ్ తన ప్రయాణంలో సహాయం చేసిన వారిని ఎలా కలుసుకున్నారు? అలాగే అతని శత్రువులను కూడా ఏ విధంగా కలిశాడు అనేది అసలు కథ.

విశ్లేషణ:
దర్శకుడు విక్రమ్ కే కుమార్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అని చెప్పవచ్చు. థాంక్యూ సినిమా కథను తీర్చి దిద్దిన విధానం చాలా కొత్తగా ఉంది. ఇంతకుముందు ఈ లైన్ తో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ ఈ తరహా మేకింగ్ తో మాత్రం ఎవరూ ట్రై చేయలేదు అనే చెప్పాలి. కంప్లీట్ గా ఒక మనిషి జీవితంలో ఎదురైనా అనుభవాలు గెలిచిన కారణాలు.. ఇలా ఎన్నో విషయాల్లో ఎదుటివారి ప్రమేయం ఉంటుంది ఇక వారిని గుర్తు చేసుకుంటూ అభిరామ్ అనే పాత్రను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. అయితే మధ్య మధ్యలో కొన్ని రొటీన్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు.  

హీరో హీరోయిన్స్ పాత్రలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసినా కూడా కొన్ని సన్నివేశాలు అయితే ముందుగానే ఊహించే విధంగా ఉంటాయి. ఇక అభిరామ్ క్యారెక్టర్ గురించి ఆడియన్స్ ముందుగానే పసిగట్టేస్తారు కాబట్టి అతను ఎలా ముందుకు వెళ్తాడు అనేది కూడా ఆడియన్స్ గ్రహిస్తారు. అయితే ఇంటర్వెల్లో మాత్రం సినిమా కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఆ తర్వాత మరికొన్ని సన్నివేశాలతో కూడా దర్శకుడు ప్రేక్షకులను సినిమా కథలోకి తీసుకువెళ్లే ప్రయత్నం బాగానే చేశాడు. కానీ ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు అని అనిపిస్తుంది.

మేయిన్ హీరోయిన్ రాశి ఖన్నా ఎమోషనల్ పాత్రలో   చాలా బాగా నటించింది. ఇక మాళవిక నాయర్ కూడా తన పాత్రలో క్యూట్‌గా అందమైన హావభావాలతో మెప్పించింది. ఇక సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ తీసిన విజువల్స్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. ఇక ఈసారి SS థమన్ తన BGM స్కోర్‌తో బాగానే ఆకట్టుకున్నాడు కానీ సాంగ్స్ విషయంలో న్యాయం చేయలేకపోయాడు. 

థాంక్యూ సినిమాలో విక్రమ్ కుమార్ ఒక ఎమోషనల్ జర్నీని చూపించాడు. హీరో నాగ చైతన్య పోషించిన అభిరామ్ లైఫ్ యొక్క వివిధ దశలను వివరించాడు.. కొన్ని సీన్స్ లో నాగచైతన్య అభినయం అద్భుతంగా ఉంది. అయితే, సరైన టార్గెట్ లేనట్లుగానే సినిమా కథ ముందుకు సాగుతున్న భావన కలుగుతుంది. తమను తాము సరిదిద్దుకోనే పాత్రలను ఇంతకుముందు తెలుగు చిత్రసీమలో చాలాసార్లు చేసినవే.  మొదటి అరగంటలోని కొన్ని క్షణాలు మాత్రమే సినిమాను అద్భుతంగా ప్రజెంట్ చేసిన విక్రమ్ ఆ తరువాత అంచనాలకు తగ్గట్టుగా హ్యాండిల్ చేయలేదు. ఏదేమైనా థాంక్యూ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండా వెళితే ఓకే అనే విధంగా ఎంజాయ్ చేయవచ్చు.

ప్లస్ పాయింట్స్
👉నాగచైతన్య
👉ఫస్ట్ హాఫ్
👉సినిమాటోగ్రఫి 

మైనస్ పాయింట్స్
👉థమన్ మ్యూజిక్
👉రొటీన్ సీన్స్
👉క్లైమాక్స్

రేటింగ్: 2.75/5

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies