భారతదేశంలో నటీనటులు వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో నేషనల్ అవార్డు అనేది కొంతమంది చాలా ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. టెక్నీషియన్స్ నిర్మాతలు కూడా అవార్డును చాలా గౌరవంగా భావిస్తూ ఉంటారు.
ఇక 2020 సినిమాలకు గాను ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లలో ఉత్తమ నటుడు విభాగంలో సూర్య అలాగే బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ లకు పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఉత్తమ చిత్రాలలో తెలుగులో అయితే కలర్ ఫోటో సినిమాకు అవార్డు దక్కింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా అల.. వైకుంఠపురంలో సినిమాకు గాను థమన్ సొంతం చేసుకోవడం విశేషం.
ఇక ఈ అవార్డులలో సాధారణంగా ఉత్తమ చిత్రాలకు రెండు లక్షల 50 వేల రూపాయల ప్రైజ్ మనీని అందిస్తారు. స్వర్ణ కమల్ (బంగారు కమలం) ప్రత్యేకంగా అందిస్తారు. అలాగే ఉత్తమ నటులకు ఉత్తమ టెక్నీషియన్స్ విభాగాలలో స్వర్ణ కమల్ తో పాటు 50వేల రూపాయల ప్రైజ్ మనీ అందించడం జరుగుతుంది. ఒక విధంగా ప్రైజ్ మనీ అనేది వారికి చాలా చిన్నది కావచ్చు. కానీ నేషనల్ అవార్డ్ అనేది మాత్రం ఒక గొప్ప అచివ్ మెంట్ అని చిత్ర ప్రముఖులు భావిస్తారు.
Follow
Post a Comment