ఆ దేశంలో RRR గ్రాండ్ రిలీజ్!


రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR  సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన తర్వాత ఓటిటి ప్రపంచంలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. విదేశాల్లో కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నట్లు సోషల్ మీడియాను చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో వివిధ దేశాల్లో థియేట్రికల్ గా విడుదల చేయాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఈ ఏడాది అక్టోబర్ 21న జపాన్ లో కూడా సినిమాను విడుదల చేయాలి అని, అది కూడా అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో సినిమాను డబ్ చేసి విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బాహుబలి సినిమా అక్కడ విడుదల చేసినప్పటికీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ మగధీర సినిమా మాత్రం జపాన్లో మంచి క్రేజ్ అందుకుని అప్పట్లో ఆ సినిమా జపాన్ లో అత్యధికంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాగా నిలిచింది. అలాగే ఎన్టీఆర్ బాద్షా సినిమా కూడా అక్కడ మంచి వసూళ్ళను రాబట్టింది. మరి ఇప్పుడు RRR ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post