The Warriorr - Movie Review


కథ: 
డాక్టర్ గా ఉన్న సత్య (రామ్) హాస్పిటల్ ఊహించని విధంగా గురు(ఆది పినిశెట్టి) అనే అతిపెద్ద గుండా నుంచి ఒక చేదు అనుభవం ఎదుర్కొంటాడు. అతను చేస్తున్న అన్యాయం చూసి ప్రశ్నించే సమయంలో ఎదురుదెబ్బ తింటాడు. అనంతరం గురు రామ్ కు విసిరిన సవాల్ ఏంటి? అసలు రామ్ డాక్టర్ గా చేయలేని పరిస్థితిని ఆ తరువాత ఎలాంటి దారిలో వెళ్లి అతన్ని ఎదుర్కొంటాడు? ఇక విజిల్ మహాలక్ష్మి(కృతి శెట్టి) ఎవరు? ఆమె సత్యకు ఎలా ఎట్రాక్ట్ అవుతుంది అనే విషయం తెలియాలి అంటే పూర్తి సినిమా చూడాల్సిందే!


విశ్లేషణ:
రామ్ పోతినేని కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమాలు చేయడానికి ఎంతగా ఇష్టపడతాడో మరోసారి ది వారియర్ బజ్ చూస్తేనే ఒక క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు కూడా పక్కా యాక్షన్ మాస్ ఎంటర్టైన్మెంట్ అని ఫుల్ మీల్స్ తరహాలో ఉంటుందని ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. ఇక సినిమా విడుదల అనంతరం వెండితెరపై కూడా రామ్ అదే తరహాలో హైలెట్ అయ్యే ప్రయత్నం అయితే చేశాడు. అతని నటన బాడీ లాంగ్వేజ్ ఈసారి ఇంకాస్త హై వోల్టేజ్ గానే కనిపించాయి. ముఖ్యంగా డైలాగ్స్ చెప్పే విధానంలో కూడా రామ్ మరింత డోస్ పెంచాడు. 

ఫస్ట్ హాఫ్ లో ఒక డాక్టర్ గా రామ్ పోతినేని సమాజంలో ఉండే అన్యాయాన్ని ఏదిరించలేక ఆ తరువాత ఎలాంటి దారిని ఎంచుకున్నాడు అనే తరహాలో ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కొనసాగించిన విధానం బాగానే ఉంది. ఇక ట్విస్ట్ గురించి పెద్దగా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమి లేదు. డాక్టర్ గా చేయలేని పని ఒక పోలీస్ ఆఫీసర్ గా మారి ఎలా చేస్తాడు అనేది మిగిలిన కథాంశం. ఇలాంటి సింగిల్ లైన్ స్టోరీ కాస్త కొత్తది అయినప్పటికీ కూడా కమర్షియల్ అంగుళాలతో బాగా నిండిపోవడంతో రొటీన్ గానే అనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా పెద్దగా గ్యాప్ లేకుండా చకచగా అన్ని సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఒక విధంగా అది బాగానే ఉన్నప్పటికీ కూడా సీన్స్ లో అంతగా కొత్త కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ కాస్త నిరుత్సాహపడే అవకాశం అయితే ఉంది.

హీరో రామ్, విలన్ ఆది పినిశెట్టి ఎదురైన విధానం ఒక విధంగా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పాలి. ఎంట్రీ సీన్ లోనే కూడా ఆది పినిశెట్టి నటించిన విధానం అద్భుతంగా ఉంది. వీరిద్దరు ఎదురుపడినప్పుడు సన్నివేశాలను మాత్రం దర్శకుడు బాగానే ప్రజెంట్ చేయగలిగాడు. అయితే ఎప్పటిలానే కమర్షియల్ సినిమాలో ఉండే అగ్రేషన్ రొటీన్ గానే ఉంది. ఇలాంటి కథలో కొత్తగా క్రియేట్ చేయడానికి కూడా దరక్షకుడికి పెద్దగా స్కోప్ లేకపోయింది.  

ఇక హీరోయిన్ పాత్ర అయితే ఈ సినిమాకు మరో పెద్ద మైనస్ అని చెప్పాలి. మునుపటి సినిమాలతో బాగానే మెప్పించిన కృతి శెట్టి ఈ సినిమాలో విజిల్ మహాలక్ష్మి గా కాస్త ఓవరాక్షన్ ఎక్కువగానే చేసింది. కమర్షియల్ రొటీన్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర ఎలాగైతే ఉంటుందో ఈసారి లింగస్వామి కూడా అదే తరహాలో హీరోయిన్ పాత్రను కంటిన్యూ చేశాడు. ఆమె పాత్ర సంబంధించిన సన్నివేశాలు తొందరగా అయిపోతే బాగుండు అని ప్రేక్షకులు చిరాకు పడతారు. హీరో హీరోయిన్ మస్య వచ్చే సీన్స్ పరమ బోరింగ్ గా ఉన్నాయి.

ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే అక్కడక్కడ పర్వాలేదు కానీ పూర్తిస్థాయిలో అయితే దేవిశ్రీప్రసాద్ ఈ సారి మెప్పించలేదు. కానీ ఇచ్చిన మూడు పాటలకు మాత్రం సినిమాకు తగ్గట్టుగా న్యాయం చేశాడు. యాక్షన్స్ సన్నివేశాలు సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఫైట్స్ అయితే ఓ వర్గం మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కదా కథనం విషయంలో మాత్రం దర్శకుడు ఊహించినంత కొత్తగా ఏమి ప్రజెంట్ చేయలేకపోయాడు. క్లయిమ్యాక్స్ అయితే ఉహించనట్లే ఉంటుంది. చాలా వరకు సీన్స్ ఆడియెన్స్ ముందే ఊహిస్తారని చెప్పవచ్చు. ఈ సినిమాలో రామ్ ఐతే చాలా ఎనర్జిటిక్ గానే కనిపించాడు. అలాగే బ్రహ్మాజీ నటన కూడా సినిమాలో పర్వాలేదు అనే విధంగా ఉంది. మిగతా యాక్టర్స్ కూడా వారి పాత్రల మేరకు బాగానే కనిపించారు. కానీ ఎక్కువగా మాత్రం రామ్, ఆదిలకు సంబంధించిన సన్నివేశాలు అందరినీ కూడా డామినేట్ చేస్తాయి. వీరిద్దరి మధ్యలనే దర్శకుడు చాలా బలమైన కథను నడిపించాలని అనుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ఓకే అయినప్పటికీ సెకండ్ హాఫ్ అంతగా వర్కౌట్ కాలేదు. పూర్తి సినిమా మాత్రం అంచనాలకు తగ్గట్టుగా అయితే ఆకట్టుకోలేకపోయింది. మరి మాస్ ఆడియెన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉రామ్, ఆది పాత్రలు
👉ఫైట్స్
👉2 సాంగ్స్ 

మైనస్ పాయింట్స్
👉హీరోయిన్ 
👉ఊహించే క్లైమాక్స్
👉రొటీన్ స్క్రీన్ ప్లే

రేటింగ్: 2.5/5

Post a Comment

Previous Post Next Post