కార్తికేయ2 హిందీ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?


నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా అనుకున్నట్లే మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా నార్త్ ఆడియెన్స్ ను కూడా బాగానే ఆకట్టుకుంటోంది. మొదటి రోజు 60 నార్త్ స్క్రీన్స్ లో వచ్చిన ఈ సినిమా ఆ తరువాత  రోజే ఏకంగా 300 స్క్రీన్స్ కు పెంచడం అంటే మాములు విషయం కాదు. 

అది కూడా అక్కడి స్టార్స్ ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్ష బంధన్ సినిమాలను తీసేసి మరి కార్తికేయ 2 సినిమాను వేస్తున్నారు అంటే ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. సోమవారం కేవలం హిందీలోనే ఈ సినిమా కోటికి పైగా వసూళ్లను అందుకున్నట్లు సమాచారం. ఇదివరకే ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ మళ్ళీ హిందుత్వ ఖ్యాతిని హైలెట్ చేసేలా కార్తికేయ 2ని అక్కడ రిలీజ్ చేయడం బాగా కలిసొచ్చింది. ఇదే తరహాలో కొనసాగితే కార్తికేయ 2 హిందీలో ఫుల్ రన్ లో 10 కోట్ల వరకు రావచ్చని సమాచారం.

Post a Comment

Previous Post Next Post