కంటెంట్ కనెక్ట్ అయితే ఆడియెన్స్ థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉంటారని ఇటీవల వచ్చిన సినిమాలు మరోసారి ఋజువు చేశాయి. అలాగే హాలిడేస్ కూడా సినిమాలకు ఎంత ముఖ్యమో కూడా అర్ధమవుతోంది. ఏకంగా 11వ రోజు కూడా మిడియం రేంజ్ సినిమాలు ఆల్మోస్ట్ మొదట రోజు అంతటి కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
చాలా చోట్ల హోస్ ఫుల్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. సీతారామం సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 1.65 కోట్ల షేర్ అందుకోగా 11వ రోజు అదే తరహాలో 1.25కోట్ల షేర్ రాబట్టింది. ఇక బింబిసార 1.54 కోట్లు అందుకుంది. ఈ సినిమా అత్యధికంగా 15 కోట్ల ప్రాఫిట్ లో ఉండగా సీతారామం సినిమా 9 కోట్ల ప్రాఫిట్ తో కొనసాగుతోంది. మరోవైపు కార్తికేయ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసి ప్రస్తుతం 2 కోట్ల ప్రాఫిట్స్ తో వెళుతోంది.
Follow
Post a Comment