ఏడాది వ్యవధిలో ప్రభాస్ 3 సినిమాలు


బాహుబలి సినిమా అనంతరం అనుకున్నంతగా సక్సెస్ చూడని డార్లింగ్ నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా ఫుల్ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. సాహో , రాధే శ్యామ్ రెండు కూడా బోల్తా కొట్టినప్పటికి రాబోయే రోజుల్లో ఫ్యాన్స్ కు మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రానున్నాయి. కేవలం ఒక ఏడాది వ్యవధిలోనే మూడు సినిమాలతో ఆకట్టుకోబోతున్నాడు
.

ముందుగా ప్రభాస్ 2023 సంక్రాంతికి ఆదిపురుష్ సినిమా రానుంది. ఇక సలార్ సినిమాను అదే ఏడాది సమ్మర్ లో తీసుకు రావాలని అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. ఇక రీసెంట్ గా సెప్టెంబర్ 28 అని ఫిక్స్ చేశారు. అనంతరం అక్టోబర్ లో లేదా 2024 సంక్రాంతికి ప్రాజెక్ట్ K రానుందని అశ్వినీదత్ క్లారిటీ ఇచ్చారు. ఇక సలార్ సెప్టెంబర్ లో వస్తుంది కాబట్టి ప్రాజెక్ట్ K 2024 సంక్రాంతికి ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రభాస్ ఒక ఏడాది వ్యవధిలో మూడు విభిన్నమైన సినిమాలను అందించబోతున్నారు. మరి ఆ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post