Bimbisara - Movie Review


కథ:
బింబిసార (కల్యాణ్ రామ్) 500 BC త్రిగర్తల సామ్రాజ్యంలో క్రూరమైన కింగ్. అయితే ఊహించని పరిస్థితులలో, బింబిసార ప్రస్తుత రోజులకు టైమ్ ట్రావెల్ చేస్తాడు.. వైద్యుడు సుబ్రమణ్య శాస్త్రి, కేతు (అయ్యప్ప పి శర్మ) అతను వస్తాడని అప్పటికే ఎదురు చూస్తున్నారు. ఇక బింబిసారుడు మరో కాలంలో ప్రయాణించడానికి కారణమేమిటి అలాగే అతను ప్రస్తుత కాలంలో ఏం చేశాడు? ఒక రాక్షస కోణం నుంచి అతను మళ్ళీ ఒక మంచి వ్యక్తిగా ఎలా మారాడు అనేది వెండితెరపై చూడాలి. 

విశ్లేషణ:
ఇదివరకే ఎన్నో టైమ్ ట్రావెల్ సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి బింబిసారలో కొన్ని కమర్షియల్ ఫాంటసీ అంశాలను మిళితం చేశారు. ప్యార్లేల్ వరల్డ్స్ కాన్సెప్ట్‌తో దర్శకుడు తెలివిగా స్క్రీన్ ప్లే సెట్ చేసుకున్నాడు.  ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సర్ప్రైజ్‌లు బాగానే పనిచేశాయి.  బింబిసారుని క్రూరత్వమైన ఎలివేషన్స్ కోసం కొంత సమయం తీసుకున్నప్పటికీ అది నెమ్మదిగా ఇంటర్వెల్ వరకు కథతో ట్రాక్‌లోకి వస్తుంది. ఇక ద్వితీయార్ధం 5వ శతాబ్దపు నుంచి కథ పూర్తిగా కమర్షియల్ మోడ్‌లోకి వెళుతుంది. ఒక చిన్న పాప సెంటిమెంట్ నుంచి సినిమా కథ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది.

అయితే ప్రతి సన్నివేశం తర్వాత కమర్షియల్ ఫార్ములా విధానం డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ లీడ్ కు తగ్గట్టుగా ఉన్నట్లు అనిపించదు. బింబిసార లాంటి క్యారెక్టర్ హఠాత్తుగా మారిపోవడం కూడా ఆడియెన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేము. ఇక ఇలాంటి సినిమాల్లో విలన్ పవర్ఫుల్ గా ఉండాలి. కానీ ఆ రూట్లో దర్శకుడు మెప్పించలేదు. బింబిసారలో టైమ్ ట్రావెల్ థియరీ ఉంది. ఇక గతంలో యమగోల యమలీలల  గుర్తుకు తెచ్చే కొన్ని సన్నివేశాలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.  హీరోను వాడుకొని విలన్ గ్యాంగ్ మొత్తం ఒక కుటుంబాన్ని కిడ్నాప్ చేసి అతనితో పనులు చేయించుకోవడం రొటీన్ ఫార్ములా.

మొత్తంమీద బింబిసార అనేది టైమ్ ట్రావెల్ అనే కొత్త కాన్సెప్ట్‌తో కూడిన కథాంశం. బెటర్ గా మొదలై తర్వాత రొటీన్ కథనంతో ముగుస్తుంది.  సైన్స్ ఫిక్షన్ కథాంశం అలాగే కళ్యాణ్ రామ్ నటన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. బింబిసారలో ముందుగా ఆకట్టుకునేది గ్రాఫిక్స్.  ట్రైలర్‌లో మంచి వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను సూచించినట్లుగా, ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పార్ట్ చాలా బాగా జరిగింది.  

స్క్రీన్ ప్లే బాగుంది కానీ సెకండాఫ్‌లో చాలా డ్రాగ్ చేసే సన్నివేశాలున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.  ఇక కళ్యాణ్ రామ్ రెండు విభిన్న ప్రపంచాల్లో ఒకే వ్యక్తిగా కనిపించాల్సి వచ్చింది.  ఆ పాత్రకు అతను న్యాయం చేశాడు. కేథరిన్ త్రెసా అయితే పాటలకే పరిమితమైంది. ఇక శ్రీనివాస రెడ్డి క్యారెక్టర్ కామెడీగా బాగానే వర్కౌట్ అయ్యింది. సంయుక్తా మీనన్ పాత్ర చిన్నదే. ఇక  ప్రకాష్ రాజ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్‌లకు రొటీన్ పాత్రలు ఇచ్చారు. 

ప్లస్ పాయింట్స్:
👉విజువల్ ఎఫెక్ట్స్
👉కళ్యాణ్ రామ్ నటన

మైనస్ పాయింట్స్:
👉విలన్ క్యారెక్టర్ 
👉క్లయిమాక్స్

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post