Sita Ramam - Movie Review


కథ:
లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్ సల్మాన్) ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక అనాథ. ఈ కథ 1964లో కొనసాగుతుంది. ఒక విజయవంతమైన మిషన్ తర్వాత, అతను ఆల్ ఇండియా రేడియోలో పాల్గొంటాడు. ఇక ఆ తరువాత అతనికి ఎమోషనల్ గా జనాలు కనెక్ట్ అవుతారు. దీంతో అతనికి లేఖలు రాయడం స్టార్ట్ చేస్తారు. కానీ హఠాత్తుగా రామ్ కు సీతా మహాలక్ష్మి (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయి అతనిని తన భర్తగా సంబోధిస్తుంది. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ మేజర్ కూతురు అఫ్రీన్ 1981లో ఒక లెటర్ ద్వారా సీతామహాలక్ష్మీ ఎవరు అనే విషయాన్ని ఒక కారణం చేత తెలుసుకోవాలని అనుకుంటుంది. అసలు 15 ఏళ్ళ క్రితం నాటి కథలో ఏం జరిగింది. సీతామహాలక్ష్మీ ఎవరు? ఆమె, రామ్ ఏమయ్యారు? అసలు వీరి కోసం ఒక పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మనవరాలు ఎందుకు వెతుకుతుంది? ఆమెకు ఏంటి సంబంధం? అనేది వెండితెరపై చూడాలి.

విశ్లేషణ:
హను రాఘవపూడి మంచి దర్శకుడే అయినా అతను ప్రతీసారి ఎదో ఒక లోపం వలన ఊహించని అపజయలను అందుకుంటున్నాడు. ఇక ఈసారి అతన్ని నమ్మి వైజయంతి మూవీస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సీతారామం సినిమాను నిర్మించారు. ఇక ఈ దర్శకుడు ఈసారి తన పూర్తి స్థాయి స్క్రీన్ ప్లే పవర్ ను చూపించే ప్రయత్నం చేశాడు. సీతా రామం ఆర్మీ, కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే పీరియాడికల్ లవ్ స్టోరీ. పాకిస్థాన్ టెర్రర్ క్యాంపులో ఇద్దరి మధ్య జరిగే సన్నివేశంతో సినిమా తెరకెక్కింది.  ఇది మొదట్లో కొంత నీరసంగా సాగే కథ కనిపిస్తుంది. కానీ సెకండ్ ఆఫ్ ట్విస్ట్ నుంచి కథ మరింత ఎమోషనల్ కంటెంట్ గా ముందుకు సాగుతుంది. మరోవైపు లండన్‌లో పాకిస్తాన్ యూత్ లీడర్‌గా పరిచయం చేయబడిన రష్మిక, బాలాజీ (తరుణ్ భాస్కర్) సహాయం తీసుకొని భారతదేశంలో సీత అలాగే రాముడి గురించి తెలుసుకోవాలని ఒక మిషన్ మొదలు పెడుతుంది. మరోవైపు ప్యార్లేల్ గా దర్శకుడు సమాంతరంగా హీరో-హీరోయిన్ వారి లవ్ ట్రాక్‌ని పరిచయం చేస్తాడు. 


దుల్కర్ సల్మాన్ నటన ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. అతన్ని కూడా కంప్లీట్ యాక్టర్ అని చెప్పవచ్చు. ఇక అతనికి పర్ఫెక్ట్ జోడిగా మృనల్ కూడా మెప్పించింది.
ఇక ఫ్లాష్‌బ్యాక్‌లో సినిమా కథ హైదరాబాద్‌ షిఫ్ట్ అయినప్పుడు సీతా రామం కాస్త స్లోగా వెళ్లినట్లు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌ల కామెడీ ట్రాక్‌ అంతగా ఏమి హెల్ప్ కాలేదు. నిజానికి, రొమాన్స్‌తో పోలిస్తే కామెడీ ట్రాక్స్ ఫ్లాప్ అయ్యాయి. ఆర్మీ థ్రెడ్‌తో కథను మరింత ముందుకు నడిపించడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచేస్తుంది.

ఇక రష్మిక మిషన్ తర్వాత జరిగే సంఘటనలు భావోద్వేగంగా ఉంటాయి. ఇక సమంత్ పాత్ర కూడా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. అందులో ఉండే సన్నివేశాల గురించి చెప్పడం కన్నా చూస్తేనే ఆ అనుభూతి ఎక్కువగా ఉంటుంది. దర్శకుడి కృషి, అతని రచనపై ఉన్న పట్టు సెకండ్ హాఫ్ లో చూడొచ్చు.  ఎండింగ్ అయిత్ర్ స్మూత్‌గా ఉంటుంది.  గుండెను బరువెక్కించే అనుభూతిని కలిగిస్తుంది. చివరగా, సీతా రామం అనేది ఆర్మీ బ్యాక్ డ్రాఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.

ఫస్ట్ హాఫ్ ఇంకాస్త మెరుగ్గా పనిచేసి ఉంటే బాగుండేది. కానీ సెకండ్ హాఫ్‌లో ఉన్న మంచి విషయాల వలన ఫస్ట్ హాఫ్ పై ఉన్న నెగిటివ్ కోణాన్ని తుడిచి పెడుతుంది. సీతా రామం సినిమా సాంకేతికంగా ఉన్నతమైన చిత్రంగా వెండితెరపై కనిపిస్తుంది. విజువల్స్ సినిమాటోగ్రఫీ బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు. ఇక విశాల్ చంద్రశేఖర్ పాటలు విజువల్‌గా ఆకట్టుకున్నాయి. అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో ప్రాణం అని చెప్పవచ్చు. మరోవైపు పిఎస్ వినోద్ కెమెరా పనితనం క్రిస్టల్ క్లియర్ గా ఉంది.  ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఎడిటర్ కాస్త అప్రమత్తంగా ఉండాల్సింది. ఇక హను రొమాంటిక్ పోర్షన్స్‌లో రైటింగ్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:
👉 స్క్రీన్ ప్లే 
👉 మ్యూజిక్
👉 లవ్ ట్రాక్

మైనస్ పాయింట్స్:
👉 ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్స్
👉 కామెడీ ట్రాక్స్

రేటింగ్: 3.25/5

Post a Comment

Previous Post Next Post